ఇబ్రహీంపేటలో పేకాట పేకాట రాయులపై మెరుపు దాడి
మన సాక్షి గొంతుక అందర్–బహార్ పేకాట ఆడుతున్న 9 మంది పట్టివేత.ఇబ్రహీంపేట గ్రామంలోని విశ్వనాధుల వెంకటాచారి ఇంటి ఆవరణలో కొంతమంది వ్యక్తులు డబ్బులను పందెంగా పెట్టి “అందర్–బహార్” పేకాట ఆడుతున్నట్లు హాలియా పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది.
అందిన వెంటనే
సమాచారం మేరకు, హాలియా ఎస్‌ఐ బి. సాయి ప్రశాంత్ తన సిబ్బందితో కలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మెరుపుదాడి నిర్వహించారు. పోలీసులను గమనించిన పేకాట ఆడుతున్న వ్యక్తులు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా, మెరుపు దాడి చేసి 9 మందిని పట్టుకున్నారు.
పట్టుబడిన వ్యక్తులు:
పాతనబోయిన సైదులు, తండ్రి కనకయ్య, వయస్సు 36 సంవత్సరాలు, ఇబ్రహీంపేట.
అనుముల మధు, తండ్రి సైదులు, వయస్సు 32 సంవత్సరాలు, ఇబ్రహీంపేట.
చాపల మహేష్, తండ్రి సత్యం, వయస్సు 35 సంవత్సరాలు, ఇబ్రహీంపేట.
వజ్జ యాదయ్య, తండ్రి నరసింహ, వయస్సు 36 సంవత్సరాలు, ఇబ్రహీంపేట.
విశ్వనాధుల సైదాచారి, తండ్రి ఆచారి, వయస్సు 36 సంవత్సరాలు, ఇబ్రహీంపేట.
కంభంపాటి సైదులు, తండ్రి రాజయ్య, వయస్సు 40 సంవత్సరాలు, ఇబ్రహీంపేట.
నాగిళ్ల ఆంజనేయులు, తండ్రి తిరుపతయ్య, వయస్సు 40 సంవత్సరాలు, ఇబ్రహీంపేట.
ఈగల ప్రశాంత్, తండ్రి రోశయ్య, వయస్సు 30 సంవత్సరాలు, ఇబ్రహీంపేట.
అనుముల దుర్గయ్య, తండ్రి అచ్చాలు, వయస్సు 43 సంవత్సరాలు, ఇబ్రహీంపేట.
వారి వద్ద నుండి 52 పేకముక్కలు, పందెం డబ్బులుగా ఉపయోగిస్తున్న రూ.8,100/- నగదు మరియు 6 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ విషయంపై ఎస్ఐ బి.సాయి ప్రశాంత్ మాట్లాడుతూ
ప్రజలు పేకాట, జూదం మరియు బెట్టింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, తమ పరిసర ప్రాంతాల్లో ఇటువంటి కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని హాలియా పోలీసులకు తెలియజేయాలని సూచించారు.








