E-PAPER

శివునిపల్లిలో ఘనంగా దసరా వేడుకలు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
manasakshigonthuka.in

శివునిపల్లిలో ఘనంగా దసరా వేడుకలు

21 Oct 2026, 2:02 pm MANASAKSHIGONTHUKA

స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబర్ 21, (మనసాక్షిగొంతుక) :స్టేషన్ ఘన్‌పూర్ మండలం శివునిపల్లి గ్రామంలోని బొడ్రాయి వద్ద వెలసిన బేతాళ స్వామి ఆలయంలో విజయదశమి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న బూర్ల వంశస్థుల సంప్రదాయం, ఆనవాయితీ ప్రకారం బూర్ల పెద్ద కొమురయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా పండుగ సందర్భంగా గ్రామ ప్రజలు, కుల పెద్దలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బేతాళ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం జమ్మి చెట్టుకు శమీ పూజ నిర్వహించి, జమ్మి ఆకులను పరస్పరం పంచుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. గ్రామంలో సుఖసంతోషాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని బేతాళ స్వామిని ప్రార్థించినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. గ్రామ ప్రజల ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఈ వేడుకలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ దసరా వేడుకలను విజయవంతంగా నిర్వహించారు.

Generating image…

Recent News :

Manasakshigonthuka Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!