మార్కెట్ చైర్మన్‌ను సన్మానించిన మండల నాయకులు
బచ్చన్నపేట, మన సాక్షి గొంతుక: చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన కొమ్మూరి ప్రశాంత్ రెడ్డిని బచ్చన్నపేట మండల నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ఎండి మసూద్ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు సందీప్, జంగిటి విద్యానాథ్, దాత్రపు నరేష్ తదితర నాయకులు కలిసి మార్కెట్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రశాంత్ రెడ్డికి నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి, రైతులకు మెరుగైన సేవలు అందించే దిశగా చైర్మన్‌గా తన వంతు కృషి చేయాలని ఆకాంక్షించారు. రైతులు తమ పంటలను మార్కెట్‌కు తీసుకువచ్చే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.అలాగే వ్యవసాయ రంగ అభివృద్ధికి, రైతుల సమస్యల పరిష్కారానికి మార్కెట్ కమిటీ కీలకంగా పనిచేయాలని నాయకులు పేర్కొన్నారు. నూతన చైర్మన్ నాయకత్వంలో మార్కెట్ కమిటీ మరింత అభివృద్ధి చెందుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఇరుగు ప్రకాష్, మైపాల్ రెడ్డి,సర్పంచ్ లు ఇజ్జగిరి రాములు, అల్వాల నర్సింగరావు, జ్యోతి భాస్కర్, గుర్రపు బాలరాజు, ఆముదాల మల్లారెడ్డి,బాల్నే రాజేష్, దాచేపల్లి రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.








