మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన పొట్లపల్లి శ్రీధర్ రావు
స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబరు 30, (మనసాక్షిగొంతుక) : చిల్పూరు మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన మోతె వెంకటయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న చిల్పూరుగుట్ట దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు బుదవారం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదే గ్రామానికి చెందిన మారబోయిన రాజకుమార్ కాలు ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులను గమనించిన శ్రీధర్ రావు వెంటనే వెంకటయ్య కుటుంబ సభ్యులకు మరియు రాజ్ కుమార్ కు ఇద్దరికి ఐదువేల చొప్పున పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈసందర్భంగా శ్రీధర్ రావు మాట్లాడుతూ సాటి మనిషికి సహాయం చేయడంలోని ఆనందం మరెందులోను ఉండదని అన్నారు. ఈ కార్యక్రమంలో చిల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ర నాగరాజు గౌడ్, నేతలు బాలరాజు, ఎనగందుల నర్సింహ్మ రెడ్డి, గడ్డమీద సురేష్, గనగోని రమేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.








