సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్ఠ –
మొదటి రోజు వేడుకలు ఘనంగా ప్రారంభం
మన సాక్షి గొంతుక ప్రతినిధి బచ్చన్నపేట మండలం. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం బండనాగరం గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం మొదటి రోజు గురువారం ఘనంగా ప్రారంభమైంది,కాకతీయ కాలంనాటి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రతిష్ఠా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి,మొదటి రోజున గణపతి పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ, జలాధివాసం వంటి సంప్రదాయ క్రతువులు నిర్వహించారు, పండితులు మంత్రాలు చదువుతుండగా భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు, మహిళలు పసుపు కుంకుమలతో, మామిడి తోరణాలతో ఆలయాన్ని అలంకరించారు.ఈ సందర్భంగా గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు,కార్తీక పౌర్ణమి పర్వదినాన స్వామి విగ్రహ ప్రతిష్ఠ పూర్తి కానుంది,అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కొల్ల నర్సిరెడ్డి, సర్పంచ్, ఇజ్జగిరి రాములు, కొల్ల మహిపాల్ రెడ్డి, పూజారి జంగిలి శ్రీరామ్ గురుస్వామి,గ్రామ పెద్దలు, పాల్గొన్నారు.








