ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు
జనగామ జిల్లా కేంద్రంలో ఘనంగా వేడుకలు..
జనగామ జిల్లా కేంద్రంలో విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ భగవానుడికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో జయంతి వేడుకలను జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షుడు సిద్ధిరాములు ఆహ్వానం మేరకు జిల్లా ఉపాధ్యక్షుడు కోడూరి మహాత్మాచారి,బచ్చన్నపేట టౌన్ ప్రధాన కార్యదర్శి కోడూరి వెంకటేష్ పాల్గొని విశ్వకర్మ భగవానుడికి పూజలు నిర్వహించారు. అనంతరం విశ్వకర్మ సమాజ సభ్యులకు జయంతి శుభాకాంక్షలు తెలిపారు.జిల్లా ఉపాధ్యక్షుడు కోడూరి మహాత్మాచారి మాట్లాడుతూ విశ్వకర్మ సమాజం దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని, సంప్రదాయ వృత్తులు, కళలు, నైపుణ్యాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
విశ్వకర్మ సమాజ ప్రజల ఐక్యత, అభివృద్ధి, సంక్షేమం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. సమాజంలోని యువతకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు సంప్రదాయ వృత్తులకు ప్రోత్సాహం అందించాలని ఆకాంక్షించారు.ఈ వేడుకల్లో
జిల్లా అధ్యక్షుడు దిగ్గోజు నరసింహ చారి,జిల్లా కార్పొరేటర్ సంఘం అధ్యక్షుడు దిగోజు సాంబయ్య చారి, జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ చారి, టౌన్ అధ్యక్షుడు సిద్ధిరాములు, టౌన్ ప్రధాన కార్యదర్శి రాజు చారి, కోశాధికారి సంతోష్, కార్యవర్గ సభ్యులు హరీష్ , సాయి,
విశ్వకర్మ సంఘం నాయకులు, ప్రతినిధులు, సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు , యజ్ఞాలు చేసి అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. వేడుకలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి.








